Site icon PRASHNA AYUDHAM

ప్రముఖ రంగస్థల కళాకారులు టీవీ , సినీ నటులు ఎం.డి జమా వారి సతీమణి కి ఘనంగా సన్మానం

సన్మానం
Headlines
  1. “స్వర సుధ సంగీత విభావరిలో ఎం.డి జమా సతీమణికి ఘన సన్మానం”
  2. “ఖమ్మంలో ఎం.డి జమా వారి కళారంగ సేవలకు గౌరవం”
  3. “టీవీ, సినీ నటులు ఎం.డి జమా వారి సతీమణికి ఘన సన్మానం”
  4. “ఓహో మేఘమాల సంగీత కార్యక్రమంలో ఎం.డి జమా వారిని సన్మానించిన స్వర సుధ”
  5. “ఎం.డి జమా యొక్క అద్భుత నటనను కొనియాడిన ప్రముఖ కళాకారులు”

ఖమ్మం : ఆదివారం సాయంత్రం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘంటసాల 102వ శతజయంతి సందర్భంగా స్వర సుధ మ్యూజిక్ యూనిట్ వారు నిర్వహించిన ఓహో మేఘమాల సినీ సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల కళాకారులు టీవీ , సినీ నటులు , ఎన్నో సంవత్సరాల నుంచి కళా రంగంలో సేవలు అందిస్తూ… నటుడిగా కీర్తి గడించిన శ్రీ ఎం.డి జమా వారి సతీమణిని ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా “స్వర సుధ” ముఖ్య సలహాదారులు సుజనహిత డాక్టర్ శ్రీమతి వనం కృష్ణవేణి మాట్లాడుతూ ఎండి.జమా కళారంగానికి అందించిన సేవలు గురించి వారి అద్భుతమైన నటన గురించి కొనియాడారు . సంస్థ అధ్యక్షులు శ్రీ కొమర్రాజు మాధవరావు , ఉపాధ్యక్షులు వి.వి రెడ్డి , గౌరవాధ్యక్షులు శ్రీపారుపల్లి సురేష్ , వ్యాఖ్యాత జి రవీందర్ , విద్యాసాగర్ , పి.జే వినయ్ కుమార్ , పిన్నెల్లి యాదగిరి మరియు కళారంగా ప్రముఖులు మాట్లాడుతూ ఎం.డి జమా యొక్క కళా నైపుణ్యాన్ని గురించి వివరించారు . ఈ వేదికపై వారిని సన్మానించుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు .

Exit mobile version