*ఆర్టీసి డిపో మేనేజర్ సునీత కు ఎండీ సజ్జనార్ సన్మానం*
*సీపీఆర్ చేసి మహిళా ఆరోగ్యం కాపాడిన డీఎం*
ఫిబ్రవరి 5 జగిత్యాల
జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీతను ఆర్టీసీ ఎండి సజ్జనార్ అభినందించారు.
జగిత్యాల కొత్త బస్టాండ్ లో ఇటీవల మహిళా ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు డీఎం సునీత సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించి జీవితాన్ని కాపాడారు.
మహిళా ఆరోగ్యాన్ని కాపాడి డీఎం చేసిన సేవలకు గాను ఆర్టీసి సంస్థ ఎండి సజ్జనార్ బుధవారం హైదారాబాద్ బస్ భవన్ సునీతకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆర్టీసి డిపో ఉద్యోగులు కవిత, ఎస్టీఐ శ్రీనివాస్, ఆఫీస్ సిబ్బంది బి ఆర్ రావు తదితరులు డిపో మేనేజర్ సునీత అభినందనలు తెలిపారు.