సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు పట్టణానికి చెందిన నర్సింగ్ ఠాకూర్ తో కలిసి భారతదేశ ఆర్మీలో మరియు భారతదేశంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎన్ఎస్ జి కమాండోలో బాధ్యతలు నిర్వర్తించి ఇటీవల రిటైర్ అయిన నర్సింగ్ ఠాకూర్ స్నేహితుడు మున్నాకు పటాన్చెరువు పట్టణంలో ఉద్యోగ విరమణ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఎండీఆర్ ఫౌండేషన్ కో- ఫౌండర్ పృథ్వీరాజ్ కలిసి శాలువాతో సన్మానించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ని సంవత్సరాలు దేశం కోసం దేశ బార్డర్లలో బాధ్యతలు నిర్వహించిన వీరికి ఇకపై పటాన్ చెరు పట్టణంలో సామాజిక కార్యక్రమాలలో బాధ్యతాయుత కార్యక్రమాలలో యువతకు స్ఫూర్తిని నింపే దిశగా ముందుకు సాగాలని పృథ్వీరాజ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువ నాయకులు, స్నేహితులు ఎండీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.