సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో మానవీయ విలువలను ప్రతిబింబించే సేవా కార్యక్రమానికి ఎండీఆర్ ఫౌండేషన్ ముందడుగు వేసింది. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించిన వ్యక్తి శరీరాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోయారు. సంఘటనా స్థలం నుండి ఆసుపత్రి వరకు, అంతిమ సంస్కారాల దాకా ఆ వ్యక్తికి ఎవరూ లేని పరిస్థితిని గమనించిన ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు, మానవత్వాన్ని మించే సేవగా ముందుకు వచ్చి బాధ్యత స్వీకరించారు. స్వయంగా శవాన్ని తీసుకెళ్లి, అన్ని సంప్రదాయాల ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన మాదిరి ప్రిథ్వీరాజ్ కు మధు ధన్యవాదాలు తెలిపారు. నేటి కాలంలో వ్యక్తిగత ప్రయోజనాలు, పనులతోనే ఎక్కువ మంది పరిమితమైపోయిన సమయంలో, అనాధల కోసం ఇలాంటి సేవ చేయడం అరుదైన విషయం. ఎండీఆర్ ఫౌండేషన్ చేపడుతున్న మానవతా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు అభినందించారు. అనాధలకు అండగా, నిరుపేదలకు తోడుగా ఉండే ఎండీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్
Published On: November 17, 2025 9:12 pm