మెదక్/నర్సాపూర్, ఫిబ్రవరి 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో వందల ఎకరాలలో డంపింగ్ యార్డు ఏర్పాటు వల్ల వాతావరణం, చెరువులు కలుషితమై చుట్టుపక్కల గ్రామ ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని అన్నారు. నర్సాపూర్ అంటేనే పర్యాటన కేంద్రంగా అడవి అందాలని చూడటానికి ప్రజలు వస్తారని, ఈ డంపు యార్డు వల్ల అటవీ సంపద కలుషితమవుతుందని, నర్సాపూర్ పట్టణంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న అఖిలపక్షానికి బీజేవైఎం పూర్తిగా మద్దతిస్తుందని తెలిపారు. డంపుయార్డు ఇక్కడి నుంచి తరలించేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసే పోరాటానికి బీజేవైఎం నాయకులం కూడా పాల్గొంటామని తెలిపారు. ఈ దీక్షలో అఖిలపక్ష నాయకులతో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రాహుల్, గోడ రాజేందర్, మేకల సన్నీ, వెంకట్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రిలే నిరాహార దీక్షకు మెదక్ జిల్లా బీజేవైఎం మద్దతు
Published On: February 22, 2025 6:19 pm
