జిల్లాలో 30,30(ఎ) పోలీసు యాక్ట్ అమలు::-జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి

పోలీసు
Headlines
  1. “మెదక్ జిల్లాలో 30,30(ఎ) పోలీసు యాక్ట్ అమల్లోకి”
  2. “డిసెంబర్ 01-31: మెదక్ జిల్లాలో నిరసనలు, ర్యాలీలకు నిషేధం”
  3. “శాంతి భద్రతల కోసం 30,30(ఎ) యాక్ట్: జిల్లా ఎస్పీ”
  4. “మెదక్ జిల్లాలో అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిషేధం”
  5. “పోలీసు యాక్ట్ అమలు: ప్రజల సహకారం కోరిన ఎస్పీ”
మెదక్ జిల్లాలో శాంతి  భద్రతలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 01 వ తేది నుండి 31 వ తేదీ వరకు నెల రోజుల పాటు మెదక్ జిల్లా వ్యాప్తంగా 30,30( ఏ ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లాలో ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment