Site icon PRASHNA AYUDHAM

అభివృద్దే లక్ష్యంగా పటిష్ట ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. 

IMG 20241228 WA0050

మెదక్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పటిష్ట ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.

(ప్రశ్న ఆయుధం ) డిసెంబర్ 28 మెదక్ జిల్లా

శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై అదనపు కలెక్టర్ నగేష్, ముఖ్య ప్రణాళిక అధికారి , బద్రీనాథ్, ఈ.ఈ పి ఆర్ నరసింహులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా మెదక్ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పటిష్ట ప్రణాళికలతో అహర్నిశలు కృషి చేస్తున్నామని ఇందుకుగాను 2021- 22, 2022- 23 సంవత్సరము గాను

5 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో 94 పనులు చేపట్టడం జరిగిందని ఇందులో సిసి రోడ్లు, భవన నిర్మాణాలు ఉన్నట్లుగా చెప్పారు ఇప్పటివరకు 55 పనులు కంప్లీట్ చేయడం జరిగిందని, 24 పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నవని వివరించారు. పెండింగ్ పనులను వేగం పెంచాలని, వివిధ దశలలో పురోగతిలో ఉన్న పనులను

వచ్చే జనవరి 2025 నెలాఖరు వరకు పూర్తి చేసే దిశగా లక్ష్యాలు కనుగుణంగా పనిచేయాలి అన్నారు. .2023-24 సంవత్సరమునకు 03 కోట్లు మంజూరైనవని ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ప్రతిపాదన సిద్ధం చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

నియోజకవర్గంలో గ్రీన్ ఫండ్ కింద 62 లక్షల నిధులు మంజూరైనవని

మెదక్ పట్టణంలో గాని, కుల్చారం మండలంలో నవగ్రహ వనం నక్షత్రవనం కార్యక్రమం అమలు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నామన్నారు. నవగ్రహ వనం అనగా 9 గ్రహాలకు సంబంధించి వివిధ చెట్లు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని, 21 నక్షత్రాలకు గాను చెట్లు నాటి వాటి పేర్లు బోర్డులతో సహా ఏర్పాటు చేయాలని

వైకుంఠ రధాలు మంజూరు చేసేందుకు కూడా పునరా ఆలోచన చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు

Exit mobile version