నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మెదక్ ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి 

*నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మెదక్ ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి

మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి శుక్రవారం నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో దీక్ష దివస్ కార్యక్రమం లో పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.నిర్మల్ జిల్లా దీక్ష దివస్ ఇంచార్జ్ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో,కేసీఆర్‌ సచ్చుడో అని నినాదమిచ్చిన కేసీఆర్‌ రాష్ట్ర సాధన కోసం మృత్యువును ముద్దు పెట్టుకొనేందుకు తెగించిన నవంబర్ 29 వ రోజు దీక్ష దివస్ అని అన్నారు.

గోసపడుతున్న తెలంగాణ ప్రాంతం సాగిస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక అపూర్వ ఘట్టం నవంబర్‌ 29 అని తెలంగాణ మర్చిపోలేని రోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగిన ఉద్విగ్న సందర్భం అని మహాత్ముడి అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌ తన దీక్షతో నాటి యూపీఏ ప్రభుత్వంతో ‘డిసెంబర్‌ 9 ప్రకటన’ చేయించగలిగారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరుత్తేజాలకు కొత్త ఊపిరులూదారు.కేసీఆర్‌ దీక్షకు ముందు..దీక్ష తర్వాత రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణా అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా,జాన్సన్,నాయక్, ముధోల్ నియోజక వర్గం సమన్వయ కర్తలు నిర్మల్, ముధోల్,ఖానాపూర్ మూడు నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అనుబంధ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now