బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ సవాల్

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ సవాల్

బీసీ రిజర్వేషన్లపై మెదక్ ఎంపీ సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు ఆయన మాట్లాడుతూ . గత మూడు రోజులుగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారనీ.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని బహిరంగ చర్చకు ఆహ్వానించారు.

“నాలుగున్నర దశాబ్దాలలో బీజేపీ బీసీల కోసం ఏం చేసిందో నేను గణాంకాలతో చెబుతాను. అదే విధంగా, బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో వారు చెప్పాలి. ఎక్కడైనా, ఎప్పుడు అయినా చర్చకు సిద్ధమున్నాను,” అని ఎంపీ పేర్కొన్నారు.

తెలంగాణలో 56% బీసీలు ఉన్నా, కేవలం ముగ్గురికే మంత్రి పదవులు ఇవ్వడం ఎంతవరకు న్యాయసంగతమో పీసీసీ నేతలు సమాధానం ఇవ్వాలన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 250 మంది ముఖ్యమంత్రులను నియమించగా, అందులో కేవలం 43 మంది మాత్రమే ఓబీసీలు (17%).

బీజేపీ 68 మంది ముఖ్యమంత్రులలో 21 మంది ఓబీసీలు (31%) ను నియమించిందనీ ఇది కదా బీసీలపై బిజెపి కున్న ప్రేమ అని ఆ ప్రేమ లేని కాంగ్రెస్ బీసీల కోసం మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు.

మోడీ మంత్రివర్గంలో 21 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారనీ

మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేవలం ఇద్దరు ఓబీసీలు మాత్రమే మంత్రులుగా పని చేశారని గుర్తు చేశారు.

NDA కూటమిలో ఉన్న 20 మంది సీఎంలలో ఐదుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు మైనారిటీలు ఉన్నారన్నారు.

రాష్ట్రపతిగా దళితులు, గిరిజనులను నియమించిన ఘనత బీజేపీ పార్టీకే దక్కుతుందన్నారు.

తెలంగాణకు ఇచ్చిన రెండు కేంద్ర మంత్రివర్గ స్థానాల్లో ఓబీసీకి ఒకటి కేటాయించిన ఘనత బీజేపీది కదా అన్నారుకాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల నిజమైన నిబద్ధత ఉంటే, రాష్ట్ర మంత్రివర్గాన్ని పునరాయోజన చేయాలి. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి” అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now