*మెదక్ పట్టణ పురపాలక సర్వసభ్య సమావేశంలో రసభస*
మెదక్ పట్టణంలోని పురపాలక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్ర
పాల్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో రసభస జరిగిందని మెదక్ పట్టణ అభివృద్ధిపై ఇలాంటి పరిస్థితులు మరోసారి జరగకుండా అధికారులు చూడాలని ఆయన అన్నారు.5 వ వార్డ్ కౌన్సిలర్ మామిళ్ళ మాట్లాడుతూ స్మశాన వాటిక కట్టడం కోసం గత ప్రభుత్వ హయాంలో డబ్బులు మంజూరు అయితే ఇప్పటివరకు స్మశాన వాటిక నిర్మాణం కోసం డబ్బులు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే 24 వ వార్డు కౌన్సిలర్ మేఘమాల రామ్ చరణ్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ వెళ్లే రహదారిపై తోపుడు బండ్లు పెడుతూ మార్కెట్ కు వెళ్లడానికి రహదారి లేకుండా నిర్వీర్యం అయిపోయిందని ఆమె స్పష్టం చేశారు.అలాగే ఈ విషయంపై 25 వ వార్డు కౌన్సిలర్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నిసార్లు మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ కమిషనర్ కి మున్సిపల్ పరిధిలోని అత్యధిక వార్డుల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడం చాలా విడ్డూరకరమని మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి సమావేశంలో అధికారులు సిబ్బందిపై సమావేశం నిర్వహించడం సమయం వృథా అవుతుందని కౌన్సిలర్లు మండిపడ్డారు.జనన,మరణాల సర్టిఫికేట్ కోసం వారం 10 రోజులు ఆగాలి.చెత్త బండ్ల కోసం శానిటేషన్,వాటర్ ట్యాంక్ కోసం చైర్మన్ కు విన్న వించుకోవాలని అంటూ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.