మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ప్రజావాణి – 66 ఫిర్యాదులు స్వీకరణ

**మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ప్రజావాణి – 66 ఫిర్యాదులు స్వీకరణ**

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 19

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం ప్రజల సందేశాలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి అదనపు కలెక్టర్ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా మొత్తం 66 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. ప్రజలు అందించిన ప్రతి వినతినీ సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనే ఆదేశాలు అదనపు కలెక్టర్ హరిప్రియ జారీచేశారు.పెండింగ్‌లో ఉంచకుండా ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, ప్రజావాణి కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టంగా సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now