మీడియా మిత్రులకు రక్షణ కల్పించాలి.
జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిదోర..
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గురువారం విశ్రాంతి భవన ఆవరణలో పత్రిక ప్రకటన ద్వారా జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిది పై దాడి హెయమైన చర్య అన్నారు.
సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిది తలపై విచక్షణరహితంగా దాడి చేసిన మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా ద్వారా ప్రతి సమస్యలను తెలియజేసే మీడియా పై దాడి చేయడం సబబు కాదని అయన మండి పడ్డారు. ఏజెన్సీ సమస్యలు మీడియా ద్వారా నే పరిస్కారం అవుతాయని అయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర కేయులకు రక్షణ కల్పించాలని అన్నారు. సినీ నటుడు మోహన్ బాబుమీడియా ప్రతినిది పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడి సంఘటనలు రాష్ట్రం లో మరల పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు ఏర్పాటు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.