గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం

*గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం…*
*డాక్టర్ మహోన్నత*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*

జమ్మికుంట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల(బాలురు)పాఠశాలలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందని డాక్టర్ మహోన్నత తెలిపారు గురుకుల పాఠశాల (బాలురు)లో సుమారు 330 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత సీజనల్ వ్యాధుల పట్ల (వర్షాకాలంలో సంభవించే వ్యాధుల) మీద డ్రై డే మీద అవగాహన కల్పించారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా మందులు అందజేశారు ఇప్పటివరకు మొదటి దశ ఆరోగ్య శిబిరాలు మండలంలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో పూర్తి చేయడం జరిగింది తెలిపారు వర్షాకాలం దృష్ట్యా తరచుగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు వైద్య శిబిరంలో డాక్టర్ మహోన్నత పాఠశాల ప్రిన్సిఫాల్ లచ్చయ్య సూపర్వైజర్ రత్నకుమారి ఏఎన్ఎం మంజుల రజిత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now