తనుగుల గ్రామంలో వైద్య శిబిరం – డాక్టర్ కార్తీక్

వైద్య
Headlines
  1. తనుగుల గ్రామంలో వైద్య శిబిరం
  2. డాక్టర్ కార్తీక్ ఆరోగ్య సేవలు
  3. పరిశుభ్రతతో వ్యాధులు దూరం
  4. వ్యాధుల లక్షణాలు మరియు జాగ్రత్తలు
  5. అసంక్రమిత వ్యాధులపై అవగాహన
  6. డ్రై డే కార్యక్రమo పై సూచనలు
  7. గ్రామస్థులకు ఆహార అలవాట్లు
  8. సహాయ సంస్థల భాగస్వామ్యం

*పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులు దూరం-డాక్టర్ కార్తీక్*

 

*జమ్మికుంట అక్టోబర్ 30 ప్రశ్న ఆయుధం:-*

 

పరిసరాలు పరిశుభ్రత తోనే వ్యాధులు దూరం అవుతాయని డాక్టర్ కార్తీక్ అన్నారు.జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తనుగుల గ్రామoలో డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 48 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇద్దరు జ్వర పీడితులను గుర్తించి, వారి రక్త పూతల నామునాలను సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు. గ్రామమస్తులకి మలేరియా, డెంగీ చికెన్ గున్యా మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు. అసంక్రమిత వ్యాధులు మధుమేహం, రక్తపోటు వ్యాధుల గురించి అవగహన కల్పించి, అవసరం ఉన్న వారికి మందులు అందజేశారు. అంతేగాకుండా వారికి ఆహార అలవాట్ల గురించి అవగాహన కల్పించారు. వ్యక్తి గత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే కార్యక్రమo చేపట్టి దోమల లార్వా లను నిర్ములించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమoలో డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ సదానందం, కుసుమకుమారి, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎం మణెమ్మ, సంపూర్ణ, పుష్పలత ఆశా కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now