మెడికల్ ఆఫీసర్ గా పని చేయడానికి అభ్యర్థులు కావలెను
చంద్ర శేఖర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
ప్రశ్న ఆయుధం 26జులై
కామారెడ్డి,
జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద బాన్సువాడ లోని బస్తీ దవాఖాన లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది పాటు మెడికల్ ఆఫీసర్ గా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ ఆఫీసర్ పోస్టు ఒకటి కలదని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు వెంట ఏం.సి.ఐ. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్, మార్క్స్ మెమోలు, 4 నుండి 10 వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు జతపరచి ఈ నెల 30 లోగా కామారెడ్డి కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి, ఎంపిక విధానం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.