మెడికల్ ఆఫీసర్స్ నూతన కార్యవర్గ ఎన్నిక

*మెడికల్ ఆఫీసర్స్ నూతన కార్యవర్గ ఎన్నిక*

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

రాష్ట్ర మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్ బిఎస్ కే) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ సంస్కార సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పల్సర్ హరీష్ గౌడ్ ను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ డాక్టర్ జి రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్ రావు (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా బిజిలి దుర్గాప్రసాద్ (హనుమకొండ), కోశాధికారిగా బండి శ్రీనివాస్ (భూపాలపల్లి), ఎన్నికయ్యారు. వీరితో పాటు 11 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment