ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో వైద్య సేవలు   

ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో వైద్య సేవలు సద్వినిగం చేసుకోవాలి 

గజ్వేల్, 10 జనవరి 2025 :

ప్రభుత్వ జిల్లా దవాఖాన లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్. అన్నపూర్ణ అన్నారు ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియం చేసుకోవాలని అన్నారు. గజ్వేల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు కంటి వైద్యం, ఎముకల ఆపరేషన్,చిన్న పిల్లల వైద్య సేవలు, ప్రతి శుక్రవారం స్త్రీ నిపుణుల వైద్యం ప్రత్యేక వైద్య సేవలు (ఎన్ సి డి క్లినిక్) నిర్వహించబడునని తెలిపారు ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆసుపత్రి లో ఎలాంటి సమస్యలు ఉన్న మా ద్రుష్టికీ తీసుకురావాలని వారు అన్నారు. వీరితోపాటు డాక్టర్. సాయి కిరణ్, డాక్టర్ మంజుల పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment