మెడిటేషన్ తో మనస్సును స్థిరీకరించవచ్చు

మెడిటేషన్ తో మనస్సును స్థిరీకరించవచ్చు

-మౌంట్ అబూ బ్రహ్మ కుమార్ రాజు భాయ్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 13, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని ఓం శాంతి బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో శుక్రవారం యోగా భట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ మౌంట్ ఆబు నుండి కామారెడ్డికి ముఖ్యఅతిథిగా వచ్చిన బ్రహ్మా కుమార్ రమేష్ భాయ్ యోగ బట్టి కార్యక్రమం నిర్వహిస్తూ పలు అంశాలను వివరించారు. అదేవిధంగా గత 34 సంవత్సరాల నుండి తపస్య చేస్తూ అందరితో మంచి అనుభవాలు చేయించడానికి మెడిటేషన్లో మనస్సు పరిపరి విధాలుగా చెదిరిపోకుండా మనసును లగ్నం చేసే విధంగా ప్రశాంతతను అనుభవం చేసే ఉపాయాలను తెలియచేసారు. శుక్ర, శనివారాలు ఈ రెండు రోజుల్లో నిర్వహించే యోగ భట్టి కార్యక్రమానికి ఎవరైనా వచ్చి లాభాన్ని పొందచ్చని తెలిపారు. మనసును ఆరోగ్యంగా ఉంచుకుంటే సకల సౌకర్యాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజయోగిని బ్రహ్మకుమారి జయదీదీ, బికే గంగా, బికే వనజ, బికే లలిత, బీకే సుజాత, బికే సంతోషి, బికే దీపా, బికే రేణుక, బికే కవిత నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, రామాయంపేట నుండి మెడిటేషన్ కోసం వచ్చిన వారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now