పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారుల మీటింగ్

*పీఎం విశ్వకర్మ*యోజన లబ్ధిదారుల మీటింగ్*

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి

మణుగూరు స్నేహ గార్డెన్ నందు జరిగిన సమావేశంలో పీఎం విశ్వకర్మయోజన జిల్లా కోఆర్డినేటర్ ఆకులనాగేశ్వరరావు గౌడ్ అధ్యక్షత వహించిన* కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని పీఎం విశ్వకర్మ అన్ని వర్గాలకు న్యాయం చేయుట కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్కీం ప్రతి ఒక్క చేతి వృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ దేశం లో స్వతంత్రం వచ్చినాడు నుండి ఈరోజు వరకు పేద వర్గాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వలు,నరేంద్ర మోడీ 11 సంవత్సరాల కాలంలో దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లటం జరుగుతుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పోడియం బాలరాజు, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, పున్నాం బిక్షపతి, జంపన సీతారామరాజు, మీసాల దుర్గారావు, దేవరపల్లి వెంకటేశ్వర్లు, లింగంపల్లి రమేష్ ,జటంగి కృష్ణ, కేసగాని శ్రీనివాస్ గౌడ్, చెన్నారావు, సువర్ణ కంటి మోహన్రావు గౌడ్ కూరపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now