ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 20 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఈ సంవత్సరం ప్రభుత్వం
నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ!ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు!
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ వెల్లడించారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేస్తూ,మార్కుల ప్రాతిపదికగా విద్యార్థులను బట్టి పట్టిస్తూ, ర్యాంకుల వైపు మాత్రమే పరుగులు తీయిస్తారని,కానీ విద్యార్థులు ఇతర సాంస్కృతిక క్రీడా రంగాల్లో గాని,సామాజిక బాధ్యతలు గాని, నైతిక విలువలఉండమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు
ఇటు అకాడమిక్ చదువులతో పాటు, క్రీడా సాంస్కృతిక రంగాలలో కూడా ముందంజలో ఉంటారని,అటు సామాజిక బాధ్యతలో గానీ ఇటు నైతిక విలువల పెంపుదల లో గాని ఉత్తమ పౌరులుగా తయారవుతారని, నేడు మన సమాజానికి ఉత్తమ పౌరులు కావాలి గాని, బట్టి పట్టి చదివి ర్యాంకులు పొందిన విద్యార్థులు కాదని ప్రభుత్వ బడులలోనే మన పిల్లలను చదివించాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి సినీగీత రచయితగాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. శుక్రవారం బడిబాట కార్యక్రమo ముగింపు సందర్భంగా నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ” ఆరవ తేదీ నుండి ప్రారంభమైన బడిబాట కార్యక్రమం ఈరోజుతో ముగిసిందని, ***** ఈ కార్యక్రమంలో భాగంగా
గ్రామంలోని ఇంటింటికి దర్శించి బడి ఈడు పిల్లలను గుర్తించడం జరిగిందని, అంతేగాక ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను మోటివేట్ చేసి, ప్రభుత్వ బడిలో చేర్పించడం జరిగిందని, అంగన్వాడికి వెళ్లి ఐదు సంవత్సరాల నుండి విద్యార్థులను బడిలో చేర్పించడం జరుగుతుందన్నారు.బడికి రాకుండా పనికి వెళ్లే విద్యార్థుల ఆరా తీయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, పాఠశాల సిబ్బంది
లావణ్య, రజిత ,నరేష్ లతోపాటు
బండి వెంకన్న , ఆర్ఎంపీ వైద్యులు తుంపురు శ్రీనివాస్, బండి రమేష్, తల్లిదండ్రులు వసంత, హైమావతి ,లక్ష్మి,
వెంకటేశ్వర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిమ్మలగూడెం ప్రభుత్వ పాఠశాలలో బడిబాట ముగింపు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం
by Naddi Sai
Published On: June 20, 2025 6:35 pm
