*ఖమ్మంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమావేశం .*
*జిల్లా వ్యాప్తంగా హాజరైన ఇంజనీర్లు ఉద్యోగులు కార్మికులు ఆర్టిజన్ అన్ మేన్ లు*
ఖమ్మం : విద్యుత్ శాఖలో రూలు ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని , ఉద్యోగుల సంఖ్య పెంచాలని , కాళీ పోస్టులు భర్తీ చేయాలని , ఉద్యోగుల పనిచేసే ప్రదేశాల్లో రక్షణ పరికరాలు మరియు రక్షణ కల్పించాలని , హాజరైన కంపెనీ అధ్యక్ష ఆనంద , కుమారస్వామి , రాష్ట్ర నాయకులు కిరణ్ చక్రవర్తి లు కోరారు . ఈ సమావేశం అధ్యక్షులు కుక్కల రామారావు అధ్యక్షతన జరిగినది . దీనిలో పాల్గొన్న కార్యదర్శి రామకృష్ణ ప్రగతి నివేదికను ప్రవేశ పెట్టినారు . దశలవారీగా కార్మికుల అనేక సమస్యలను పరిష్కరించుట జరిగిందని అన్నారు . అనేకమందికి ట్రాన్స్ఫర్ లో గాని ఇతర అంశాలలో గాని అండగా నిలిచి అసోసియేషన్ లో వారికి తోడుగా నిలిచిందని పేర్కొన్నారు . డిపార్ట్మెంట్లో ఇంకా ప్రమోషన్ ఇవ్వాల్సిన వారు ఉన్నారని త్వరగా వారికి ప్రమోషన్లు అందజేయాలని కోరారు .