ఇస్నాపూర్ మున్సిపల్ కమీషనర్ ను కలిసిన మెట్టు శ్రీధర్

సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇస్నాపూర్ మున్సిపల్ కమీషనర్ శ్రీహరిని నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మున్సిపల్ పరిధిలోని కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కమీషనర్ దృష్టికి తీసుకెళ్ళినట్టు మెట్టు శ్రీధర్ తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ముత్తంగి చెరువు నీరు చిట్కుల్ పరిధిలోని నూతన కాలనీలైన  సాయి కాలని, పార్థసారథి నగర్ డిఫెన్స్ కాలనీ, నాగార్జున కాలనీల ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. కాలనీల సి.సి రోడ్డు, డ్రైనేజి సమస్యలు కూడా కమీషనర్ కు వివరించినట్టు వాటి పరిష్కారానికి భవిషత్ లో తగు చర్యలు తీసుకోవాలని మెట్టు శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వై ఎస్సార్ సి.పి రాష్ట్ర నాయకులు డప్పు రాజు, కాంటా రాములు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now