పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో మెగా రక్తదాన శిబిరం

పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో మెగా రక్తదాన శిబిరం

జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 29న కామారెడ్డిలో నిర్వహణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్‌ 28 

 

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరం అక్టోబర్‌ 29వ తేదీ బుధవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం (AR హెడ్‌క్వార్టర్స్‌), కామారెడ్డిలో ప్రారంభం కానుంది.

పోలీస్‌ అమరవీరుల త్యాగాలకు గౌరవ సూచకంగా, ప్రాణదానం ద్వారా స్ఫూర్తిదాయక సేవ చేయడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పోలీసులు పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించవచ్చని పేర్కొన్నారు.

కామారెడ్డి పట్టణం పరిధిలోని ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పోలీస్‌ అధికారులు కోరారు.

వివరాల కోసం సంప్రదించవలసిన వారు:

నరహరి, ఎస్‌.హెచ్‌.ఓ., కామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌.

📞 87126 86145

Join WhatsApp

Join Now

Leave a Comment