Site icon PRASHNA AYUDHAM

ఎల్లారెడ్డిలో సెప్టెంబర్ 14న మెగా రక్తదాన శిబిరం

IMG 20250912 WA0188

ఎల్లారెడ్డిలో సెప్టెంబర్ 14న మెగా రక్తదాన శిబిరం

 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్12 (ప్రశ్న ఆయుధం):

మానవతా విలువలను కాపాడుతూ, ప్రాణాలను రక్షించే లక్ష్యంతో ఈనెల 14వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డి మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడనుంది.

 

ఈ శిబిరాన్ని ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలా నాయుడు సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ అధ్యక్షుడు గాయాజుద్దీన్ మాట్లాడుతూ, “రక్తదానం మహత్తరమైన సేవ. ఒక్క బాటిల్ రక్తం అనేకమంది ప్రాణాలను కాపాడగలదు” అని తెలిపారు.

 

స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Exit mobile version