ఆర్టీసీ బస్ డిపోలో మెగా హెల్త్ క్యాంపు
జీవిత భాగస్వామికి వైద్య పరీక్షలు
ఆరోగ్యం- మహద్బాగ్యం ..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో 1 జీవిత భాగస్వామితో పాటు ఉద్యోగి ఆరోగ్య శిబిరాన్ని పారా మెడికల్ సిబ్బంది హనుమకొండ వారి సహకారంతో బుధవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మెడిసిన్ అందజేశారు.అనంతరం నిజామాబాద్ 2 డిపోను ఏ. మునిశేఖర్ తనిఖీ చేశారు.నిజామాబాద్ 1డిపోను సందర్శించి, డిపోలో జరుగుతున్న జీవిత భాగస్వామితో పాటు ఉద్యోగ ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు.రీజనల్ మేనేజర్ కార్యాలయంలో డిపో వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బందికి వైద్య సేవలు అందించిన పారామెడికల్ సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు సరస్వతి, శంకర్, నిజామాబాద్ డిపో 1 ఆనంద్ కుమార్, వందేమాతరం శ్రీనివాస్,పారా మెడికల్ సిబ్బంది రాకేష్, శివ,అక్షయ, వందన, శ్రావ్య,మహిన్ తదితరులు పాల్గొన్నారు.