శేరి సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా సేవా కార్యక్రమాలు

IMG 20250717 WA0611

శేరి సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా సేవా కార్యక్రమాలు

ప్రశ్న ఆయుధం జులై17: కూకట్‌పల్లి ప్రతినిధి

ముఖ్య అతిథి: టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్

కూకట్పల్లి నియోజకవర్గంలో విశ్వాసపాత్ర నాయకుడిగా, ప్రజల నమ్మకాన్ని చూరగొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జూలై 18 న అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కె.పి.హెచ్.బి కల్చరల్, వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

సుదీర్ఘకాలంగా పార్టీ మారకుండా కాంగ్రెస్ పట్ల నిబద్ధతతో నిలిచిన నాయకుడిగా సతీష్ రెడ్డి , పి.జె.ఆర్ శిష్యరికంలో రాజకీయ అనుభవాన్ని ఆర్జించి, ప్రజల సమస్యల పరిష్కారంలో విశేష పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజును సేవా దినంగా మార్చుకోవడం నాయకుడిగా ఆయన ప్రత్యేకతను ప్రతిబింబిస్తోంది.

📍 స్థలం: టెంపుల్ బస్సు స్టాప్, కూకట్పల్లి
ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు

🔹 ప్రముఖ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
🔹 మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ హాజరుకానున్నారు.
పార్టీ అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని, సతీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

సేవే మంత్రంగా.. జన్మదినాన్ని సేవా దినంగా మారుస్తున్న ప్రజానాయకుని ఆశీర్వదించాలని నిర్వాహకులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment