సీతారాముని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు

సీతారాముని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు డ్రగ్స్ అండ్ ఫార్మసీ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి

జమ్మికుంట ప్రశ్న ఆయుధం జులై 21

అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఆదివారం రోజున రాజ్యసభ సభ్యుడు డ్రగ్స్ అండ్ ఫార్మసీ చైర్మన్ బండి పార్థసారధి రెడ్డి దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ముందు వీరికి ఆలయ కార్యనిర్వనాధికారి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు గతంలో వీరు దేవాలయం సాలహారం రాజగోపురం దేవాలయంలో లోపల గ్రానైట్ వేయించుటకు గాను 3 కోట్ల రూపాయల నిధులతో పని చేయించారని గుర్తు చేశారు ఈవో సుధాకర్ ప్రస్తుతం దేవాలయమునకు అవసరమైన భక్తుల వసతి గృహాలు ఇతర పనులను చేయించుటకు నిధులు కావాలని కోరగా బండి పార్థసారథి రెడ్డి సంసిద్ధతను వ్యక్తం చేశారు త్వరలో దేవాలయమునకు వసతి గదులు ఇతర పనులు నిమిత్తం నిధులు విడుదల చేస్తారని తెలిపారని ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు

Join WhatsApp

Join Now