Site icon PRASHNA AYUDHAM

సమస్యలపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నీ కలిసిన జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్

IMG 20241113 WA0211

ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు

సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించిన చైర్మన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ తెగల షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ని జిల్లాలో ఉన్న వివిధ సమస్యలపై జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఎల్ వెంకటేశ్వర్లు వారి దృష్టికి తీసుకెల్లుతు వినతిపత్రం అందించినారు ఎన్నో ఏళ్లుగా ఐటిడిఎ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను గిరిజన ప్రాంతం నిరుద్యోగులతో భర్తీ చేయాలని కోరినారు
ఏజెన్సీ ప్రాంతంలో ఖనిజ సంపాదన ఇసుకరీచులను గిరిజన సొసైటీల ద్వారా జీవనోపాధిగా కల్పించాలని అన్నారు
ఐ టి సి పి ఎస్ పి డి నవభారత్ వెంచర్ లిమిటెడ్ లో గిరిజనుల కు జీవనోపాది కల్పిస్తూ వాటి అనుబంధ పరిశ్రమలలో సివిల్ మరియు నాన్ సివిల్ పనులలోవారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల ద్వారా ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇవ్వాలని కోరుతున్నారు
జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్న ఖాళీ పోస్టులను గిరిజన సొసైటీ ద్వారా గా ఎంపిక చేయాలని కోరినారు
పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న క్వారీలను బినామీ పేర్లతో ఉన్న వాటిని రద్దు చేయాలని విన్నవించారు
పాల్వంచలోని కేటీపీఎస్ మరియు మణుగూరులో భద్రాద్రి ప్లాంట్ లో ఉన్న బూడిద ప్లాంట్ టెండర్లను గిరిజనులకు ఇవ్వాలని కోరినారు
ఐటిసి పిఎస్పీడీ వారు ఈ ప్రాంతంలో ప్రజల వైద్యం కొరకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరారు
జిల్లాలో ఉన్న ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీ సెక్రటరీ పోస్టులను త్వరగా భర్తి చేయాలని విన్నవించారు.
జిల్లాలో ఉన్న అంగన్వాడి టీచర్లు మీని టీచర్లు ఆయా పోస్టులను నిరుద్యోగులచే భర్తీ చేయాలని విన్నవించారు.
జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపరిచే వారికి ప్రమోషన్లు అర్హత బట్టి ఇవ్వాలని కోరినారు
సింగరేణి కెటిపీఎస్ బీటీపీఎస్ లలో ఎస్సీ, ఎస్టి లెజనింగ్ ఆఫీసర్లను నియమించాలని వివరించారు.
ప్రభుత్వ నిర్వహించే టెండర్లలో పనులలో
ఎస్సీలకు 15% ఎస్టిలకు 10% అవకాశం కల్పించాలని కోరినారు
పైన తెలిపిన విషయాలన్నీ కూడా సంబంధిత అధికారులకు సిఫార్సు చేస్తూ పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ శ్రీ గౌ భక్కీ వెంకటయ్యతెలిపారు.

Exit mobile version