పీసీసీ చీఫ్ ను కలిసిన ప్రైవేట్ కాలేజి మేనేజ్ మెంట్ అసోసియేషన్ సభ్యులు..

పీసీసీ చీఫ్ ను కలిసిన ప్రైవేట్ కాలేజి మేనేజ్ మెంట్ అసోసియేషన్ సభ్యులు..

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 04

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు శనివారం హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ స్పందించి సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అంబోజి హరిప్రసాద్, అధికార ప్రతినిధి అరుణ్ కుమార్,సుజన్ రెడ్డి, మిగతా యాజమాన్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now