ప్రశ్న ప్రశ్న ఆయుధం న్యూస్ 29 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పర్యావరణ ప్రేమికులు శ్రీ ఎన్ బలరాం (ఐఆర్ఎస్) జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం నాడు మణుగూరు ఏరియా సింగరేణి సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో మణుగూరు అశ్వాపురంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.సేవా సమితి, సేవా సభ్యులు యస్ డి నా సర్ పాషా,జమీల దంపతుల కుమారుడు హుమాయున్ లాహ్యా దంపతుల ఆధ్వర్యంలో అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి క్వింటా బియ్యం, సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయగా సేవా కార్యదర్శి షేక్ షా రవూఫ్ దంపతులు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.కేక్ కటింగ్ కారిక్రమం నిర్వహించారు.అనంతరం వృద్ధాశ్రమం ఆవరణలో సేవా సమితి సభ్యులు వృద్ధులతో కలిసి పండ్ల మొక్కలు నాటారు,
శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్ల పంపిణీ చేశారు. మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ శ్రీవిద్యాభ్యాస పాఠశాల విద్యార్థులు చక్కని ప్లే కార్డ్స్ ప్రదర్శించారు అనంతరం విద్యార్థులతో కలిసి సేవా సమితి సభ్యులు పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కల నాటారు ఈ సందర్భంగా ఏరియా సింగరేణి సేవా కార్యదర్శి షేక్ షాకీరా రవూఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.సింగరేణి సంస్థకు ఎండినీ అనే గర్వం లేకుండా సింగరేణి కార్మిక కుటుంబాలతో మమేకమై సింగరేణి సంస్థ పురోగతికి పాటుపడుతున్న సిఎండి బలరాం పర్యావరణ ప్రేమికులుగా ఎంతో గుర్తింపు పొందారన్నారు.ధనం మూలం ఇదం జగత్ నిన్నటి మాట అయితే పచ్చదనం మూలం మిదం జగత్ నేటి బలరాం మాట అనే విధంగా పచ్చదనం పెంపుకై ఆయన చేస్తున్న కృషిని వారు అభినందించారు అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులు బాల వెలుగు చిన్నారులు సేవా సమితి సభ్యులు సేవ సభ్యులు బలరాం కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో ఆహ్వాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, జమీలా బేగం, షాకీరాబేగం ,పులి శెట్టి సంధ్య, సామాజిక కార్యకర్త బౌద్ధమత అభిమాని అంగోత్ మంగీలాల్,సామాజిక సేవకులు కర్నే బాబురావు,ఉప్పల శివరామకృష్ణ,వృద్ధాశ్రమం నిర్వాహకులు షహనాజ్, మహరాజ్ దంపతులు, బాల వెలుగు నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి,సుహాసిని దేవి, చంద్రకళ, పాయం కుమారి, తదితరులు పాల్గొన్నారు.