ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కమిటీ సభ్యులు 

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కమిటీ సభ్యులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 4

 

టేక్రియల్‌లో కొత్త ఇల్లు నిర్మాణానికి నాంది.

ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకుల సమక్షం,

వార్డు ఆఫీసర్ దీప్తి పర్యవేక్షణ

సామూహికంగా విజయవంతం చేయాలని పిలుపు.

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు, టేక్రియల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సోమవారం నాంది పలికారు. లబ్ధిదారైన కొత్తపల్లి పద్మ ఇంటికి ముగ్గు వేయడం ద్వారా ప్రారంభోత్సవాన్ని జరిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ దీప్తి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, శంకరరావు, ఉత్తనూరి రవి పాటిల్, పెద్ద పోతన్న గారి రాజేష్, కొత్తపల్లి చిట్టిబాబు,పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి మల్లయ్య, ఒడ్డెం సందీప్, కొత్తపల్లి సుధాకర్, కొత్తపల్లి రాజు, కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్వరూపంగా నిలవాలని, సమర్థవంతంగా నిర్మాణం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now