*అంగన్వాడి సెంటర్ ను సందర్శించిన గ్లోబల్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ చైల్డ్ టీం సభ్యులు*
*జమ్మికుంట జులై 10 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గల అంగన్వాడి సెంటర్ ను గురువారం గ్లోబల్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ టీం సభ్యులు సందర్శించారు. అంగన్వాడి సెంటర్ లను అధ్యయనం చేసే ఉద్దేశంతో జగ్గయ్యపల్లె గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ని సందర్శించడం జరిగిందని వారు తెలిపారు. చైల్డ్ టీం సభ్యులు పిల్లల యొక్క రోజువారి కార్యక్రమాలు, అంగన్వాడీ టీచర్ బాలింతలకి, అంగన్వాడి పిల్లలకి చెప్పే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పిల్లలకి వారి యొక్క తల్లులకి బాలింతలకి ఇచ్చే శిక్షణ గురించి అంగన్వాడి పిల్లలు, తల్లులు ఇచ్చిన సమాచార సూచనలు తెలుసుకొని రానున్న రోజులలో అంగన్వాడి సెంటర్లలో అనేక కార్యక్రమాలు చేపడతామని అంగన్వాడీ టీచర్ కు, తల్లులకు సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ టీ మెంబర్లు, అంగన్వాడి సిడిపిఓ సుగుణ అంగన్వాడి సూపర్వైజర్ శిరీష ఫ్రీ స్కూల్ నితిన్ అంగన్వాడి కార్యకర్త సోమ సంధ్యారాణి తల్లులు తదితరులు పాల్గొన్నారు.