విజయ్ కుమార్ గౌడ్ ను సన్మానించిన ముదిరాజ్ సంఘం సభ్యులు

నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి జనవరి 01:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరుడైన మలిదశ తొలి తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ఎడపల్లి మండల ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు. పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తమ ఆలోచనకు స్పందించి విగ్రహం నెలకొల్పేందుకుగాను ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకు వచ్చిన జాన్కంపేట్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ ను ఎడపల్లి మండల ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సున్నపు ఓడ్డెన్న, ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ…. తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కిష్టన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన తరుణంలో విగ్రహం ఏర్పాటుకు ఆర్థిక చేయూతను అందించిన విజయ్ కుమార్ గౌడ్ ను మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. జాన్కంపేట్, బోధన్, అలీసాగర్ కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నామని, అనుమతులు లభించిన అనంతరం పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం విజయకుమార్ గౌడ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవాలని ఉద్దేశంతో పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం ఎంతో గొప్పదని, అమరవీరుని విగ్రహానికి ఆర్థిక చేయూతనందించినందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నట్లు తెలిపారు.తనను అభినందించి సన్మానించిన మండల ముదిరాజ్ సంఘం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సున్నపు అశోక్, సభ్యులు ఆంజనేయులు, ఆకుల నారాయణ, గ్యాస్ లింగం, గోపి, గుండా శీను తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now