నూతన ఆర్డీవోను శాలువాతో సత్కరించిన సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు 

నూతన ఆర్డీవోను శాలువాతో సత్కరించిన సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు

-ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కామారెడ్డి ఆర్ డి ఓ గా నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన కే.వీణ. ( డిప్యూటీ కలెక్టర్) ని కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఆయా మండల ల తాసిల్దార్ ల సమక్షంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, జిల్లా ప్రతినిధులు ఆర్డీవో ను శాలువాతో సత్కరించి మేమెంట్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కే వీన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 అభివృద్ధి కొరకు నిర్వహిస్తున్న అనేక అవగాహన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని సహ చట్ట ప్రతినిధులను అభినందించారు. సమాచార హక్కు చట్టం 2005 అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించరు. సమాచారా హక్కు చట్టం 2005 అనేది పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు. అలాగే ప్రతి రెవెన్యూ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005ను 100 శాతం అమలు చేస్తున్నామని తెలియజేస్తూ, ప్రజలు వారికి కావలసిన సమాచారాన్ని ఆయా రెవెన్యూ కార్యాలయాల ద్వారా పొందవచ్చునని తెలియజేశారు ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల గడువు లోపల సంబంధిత అధికారి సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు షబానా బేగం, జిల్లా ప్రతినిధులు అన్వర్ గౌరీ,ఏస్, జమున,అస్మా తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment