ఘనంగా మైనంపల్లి హన్మంతరావు వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా మైనంపల్లి హన్మంతరావు వివాహ వార్షికోత్సవ వేడుకలు

గజ్వేల్, 16 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వాణి దంపతుల వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి, నాయిని యాదగిరి, గోపాల రావు ఉప్పల ప్రవీణ్, కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రభుత్వ దావఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు వాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అంటే నేను ఉన్న అంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ ప్రజల ప్రేమ అభిమానాలు పొందిన మైనంపల్లి హన్మంతరావు ఇలాంటి పెళ్లి రోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకోవడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు, గోపాల్ రావు పంతులు, యెర్ల రాజశేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఫారుక్ జానీ, బంగారు రెడ్డి, మల్లారెడ్డి, సంతోష్ పంతులు, సయ్యద్ బాబా,సమీర్ ఇర్షాద్,నాయిని తిరుపతి, రాజు,మామిడి కృష్ణ, శశిభూషన్ , కరుణాకర్, మహేశ్వర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now