ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 31(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో మధ్యలో నిలిచిపోయిన ప్రభుత్వ పాఠశాలను విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పులిమామిడి నవీన్ గుప్త తన స్వంత డబ్బులతో పూర్తి చేస్తున్న విషయం తెలుసుకున్న శివ్వంపేట మండల విద్యాధికారి బుచ్య నాయక్ నవీన్ గుప్త తో కలసి పాఠశాలని సందర్శించి నవీన్ గుప్త చేస్తున్న సేవని కొనియాడటం జరిగింది . రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం ఎన్నో సేవలు చేస్తారు కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసే నాయకుడు నవీన్ గుప్త అని అభినందించారు. ఈ కార్యక్రమం లో మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు దావూద్ , వంజరి నాగభూషణం , శివరామగౌడ్ , సోనూ , మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ , మధు , తదితరులు పాల్గొన్నారు.