పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎంఈవో
: బసవన్నపల్లి రాజంపేట జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ లను మండల విద్యాశాఖ ఆధికారి పూర్ణచందర్రావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్య బోధన చేయడం జరుగుతుంది దీనిలో తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులలో విద్యార్థులు స్వతహాగా నేర్చుకుంటూ ముందుకెళ్లే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను డెవలప్ చేయడం జరిగిందన్నారు. ఈ విధమైన బోధన ద్వారా విద్యార్థులకు జాయ్ ఫుల్ లర్నింగ్ మెథడ్ ద్వారా కంప్యూటర్ బోధన జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ఈశ్వరయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, వసంత, పాఠశాల ఉపాధ్యాయులు,సి ఆర్ పి లు పాల్గొన్నారు