*విద్యలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెరిట్ అవార్డులు ప్రధానం చేసిన ఆవోపా*
జమ్మికుంట జూలై 20 ప్రశ్న ఆయుధం
చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిటీ అవార్డును కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆవోపా (ఆర్యవైశ్య అఫీషిల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్)అవార్డులు ప్రధానం చేశారు. ఆదివారం ఆకినపెళ్లి శ్రీనివాస్ స్థానిక గీతా మందిర్ లో మెరిట్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో పదవ తరగతి, ఇంటర్ ,ఇంజనీరింగ్, మెడికల్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ సర్టిఫికెట్స్ ను ప్రధానo చేశారు అనంతరం ఆవోపా నాయకులు మాట్లాడుతూ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు అవార్డు ప్రధాన చేయడంలో ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని వారు కూడా మునుముందు ఇలాంటి అవార్డులను తీసుకోవాలని వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే దీని యొక్క ఉద్దేశమని అన్నారు కరీంనగర్ జోనల్ జనరల్ సెక్రెటరీ అయిత ఈశ్వర్ ప్రసాద్ ప్రధాన వక్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంగల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా గెజిటెడ్ హెడ్మాస్టర్ల ప్రెసిడెంట్ సుదర్శన్ జోనల్ నాయకులు బచ్చు రమేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట ప్రధాన కార్యదర్శి కొండ్లె నగేష్ ఆర్థిక కార్యదర్శి మంచాల రాంబాబు సీనియర్ సభ్యులు డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య రావి కంటి సురేందర్ బాదం రమేష్ బాబు బచ్చు శివకుమార్ హుజురాబాద్ ఆవోపా అధ్యక్షులు ఈశ్వరయ్య కార్యవర్గ సభ్యులు రావి కంటి పవన్ కుమార్ తాడిశెట్టి సురేషు వ్యాంసాని రమేషు మాడూరి జగదీశ్వర్ తంగేళ్ల పెళ్లి రాజ భాస్కర్ యాద శ్రీనివాస్ పుల్లూరి చంద్రశేఖర్ గోలి సాంబశివుడు చెట్ల చంద్రమౌళి జిల్లా బాధ్యులు అయిత సుధాకర్ దేవునూరి సాంబయ్య మీడియా కన్వీనర్ భూపతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.