Headlines
-
మెట్రోరైల్ విస్తరణ: మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు వెళ్ళాలనే డిమాండ్
-
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెట్రోరైల్ సాధన సమితి వినతిపత్రం
-
మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును విస్తరించాలి – సాధన సమితి
-
పటాన్ చెరు ద్వారా ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడగించే అవసరం – సత్తన్న
-
మెట్రో రైలు విస్తరణకు కేంద్ర మంత్రి, ఎంపీ సహాయం కోరిన మెట్రోరైల్ సాధన సమితి
*మెట్రోరైల్ ను మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు విస్తరించాలి – మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సత్తన్న*.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎం.పి.రఘునందన్ రావు లకు వినతిపత్రం అందజేత*
పటాన్ చేరు:
మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు విస్తరించాలని మెట్రోరైల్ సాధన సమితి అధ్యక్షులు మాజీ ఎంఎల్ఏ కే. సత్యనారాయణ మరియు సభ్యుల అధ్వర్యంలో కేంద్రబొగ్గుగనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి , మెదక్ ఎంపీ రఘునందన్ రావు లకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, గత ప్రభుత్వం ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు ను విస్తరించాలని ప్రతిపాదించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీ.వో లో పటాన్ చెరు వరకు మాత్రమే ప్రతిపాదించిందని , సంగారెడ్డి జిల్లాకు లాభం జరగాలంటే పారిశ్రామిక వాడ ఇస్నాపూర్ పూర్ వరకు మెట్రో ను పొడగించాల్సిందే అని మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేయడం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేవిధంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘురందన్ రావు ని కోరడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించినట్టు మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు రుద్రారం శంకర్ , అబ్దుల్ బాసిత్, ఈర్ల రాజు ముదిరాజ్, మెట్టు శ్రీధర్, పన్యాల శ్రీనివాస్ రెడ్డి ప్రకటనలో తెలపడం జరిగింది