*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం అందజేత*
సంగారెడ్డి/పటాన్ చెరు, జనవరి 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెట్రో రైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు విస్తరించాలని మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, సభ్యుల అధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు ను విస్తరించాలని ప్రతిపాదించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీ.వోలో పటాన్ చెరు వరకు మాత్రమే ప్రతిపాదించిందని అన్నారు. సంగారెడ్డి జిల్లాకు లాభం జరగాలంటే పారిశ్రామిక వాడ ఇస్నాపూర్ వరకు మెట్రో ను పొడగించాల్సిందేనని మెట్రో రైల్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేవిధంగా చొరవ తీసుకోవాలని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహాను కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ సాధన సమితి సభ్యుడు రుద్రారం శంకర్, అన్వర్, పటేల్, మెట్టు శ్రీధర్, చవ్వ రమేష్ తదితరులు పాల్గొన్నారు.