Headlines :
-
గౌరారం గోపాల్ సూచన: మధ్యాహ్న భోజనం నిర్వహణకు శాశ్వత పరిష్కారం
-
మధ్యాహ్న భోజనం పథకం: ఉపాధ్యాయులకు పరిష్కారం చూపాలని గౌరారం గోపాల్
-
పాఠశాల మధ్యాహ్న భోజన సమస్యలు: శాశ్వత పరిష్కారానికి కమిటీ ఏర్పాట్లు
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం అవసరం: గౌరారం గోపాల్
-
పాఠశాలలను నాణ్యమైన బియ్యం, కుకింగ్ కాస్ట్ పెంచడం: పరిష్కార సూచనలు
*అధ్యక్షులు గౌరారం గోపాల్*
రేగడి మైలారం ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మండల సభలో జిల్లా ఎన్నికల అధికారి రాములు ఆధ్వర్యంలో మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగ గౌరారం గోపాల్ ఉపాధ్యక్షులుగ రమేష్ సల్మా ,లక్ష్మి ప్రధాన కార్యదర్శిగ అలీముద్దీన్ కోశాధికారిగా రతన్ రాజ్ నూతన కమిటీగా ప్రకటించారు. అనంతరం గౌరారం గోపాల్ మహాసభలో మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఎం డి ఎం మధ్యాహ్నన భోజన పథకం అమలులో ఉన్న ఇబ్బందులు, లోపాలను మూల కారణాలను అన్వేషించకుండా పరిష్కరించకుండా కమిటీలను వేస్తేనో భయభ్రాంతులకు గురిచేస్తేనో సమస్య పరిష్కరించబడదు, పైగా మరింత జటిలమవుతుంది.మొదటగా చూడాల్సింది కుకింగ్ కాస్ట్. వాస్తవికంగా ఉన్న మార్కెట్ ధరలకు, వాటిలో వచ్చే హెచ్చుతగ్గులకు అనుగుణంగా కుకింగ్ కాస్ట్ పెంచబడాలి. బహిరంగ విపణిలో కోడిగుడ్డు ధర ఆరు ఏడు రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం అయిదు రూపాయలు చెల్లిస్తాను తప్పనిసరిగా కోడిగుడ్డు పెట్టాలి అంటే ఏ నిర్వహకుడు పెట్టడానికి ముందుకు వస్తాడు దానికి ప్రధానోపాధ్యాయున్ని నిందిస్తే, శిక్షిస్తే సరైనదేనా నిర్వాహకులకు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి. ప్రతి నెల 10వ తేదీ లోపల అంతకుముందు నెలకు సంబంధించిన బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఏనాడు చెల్లించిన దాఖలాలు లేవు. బిల్లులన్నీ నెలలు తరబడి పెండింగ్లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు అందరూ సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే. బిల్లులన్నీ వారికి ఏక మొత్తంగా ఎప్పటికప్పుడు చెల్లించాలి.సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన బియ్యాన్ని మాత్రమే పాఠశాలల్లో వినియోగిస్తారు. పలు సందర్భాలలో బియ్యం తూకం తక్కువ రావడం ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొత్త బియ్యం పంపిణీ చేసినప్పుడు బియ్యంతో వంట చేసిన ప్రతిసారి ప్రతిరోజు పాఠశాలల్లో ఇబ్బందే ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ పంపించిన సందర్భంలో బియ్యం తొందరగా పాడైన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. బాగా పాత బియ్యం పంపించిన సందర్భాల్లో పురుగులతో కూడిన బియ్యం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్ని పంపించాలి.పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ఒక సమాంతర వ్యవస్థను పూర్తిస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది. అది సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం కావచ్చు.లేదా.అక్షయపాత్రలాంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేదా మరొక విధానం. పాఠశాల ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను భోజనం చేసే విద్యార్థుల సంఖ్య తెలపడం వరకు మాత్రమే పరిమితం చేసి, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని డైరెక్ట్గా అందించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయుల ప్రాథమిక విధి విద్యార్థులకు బోధన జరపడమే. ఈ ప్రాథమిక విధులకు విఘాతం కలిగించే బోధనేతర పనుల నుండి ఉపాధ్యాయులను మినహాయించినప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య పాఠశాల ద్వారా అందించబడుతుంది.
ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్న భోజన సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తగు చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్లు చేస్తే సమస్యలు తీరిపోతాయి అనుకుంటే మాగనూరు పాఠశాలలో మూడవసారి కూడా మధ్యాహ్న భోజనం సమస్య ఏర్పడి ఉండేది కాదు. అకారణంగా.ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు. మిడ్ డే మీల్స్ ఏజెన్సీ రద్దు చేశారు. చివరికి డిఇఓ ను కూడా సస్పెండ్ చేశారు అయినా ఆ వరుస ఘటనలు ఆగలేదు కావున ప్రభుత్వం, అధికారులు పై సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు జిల్లా నాయకులు బసప్ప శివరాజ్ ఎఫ్ నర్సింలు కార్యదర్శి మల్లేష్ మండల కార్యదర్శిలు శివరాజ్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కార్యదర్శి నరేందర్ గౌడ్ సర్దార్ క్రేజర్ అన్వర్ రవి తిరుపతి ఆనంద్ రావు అయుబ్ పాష ముద్దసిర్ వికాస్ మహిళా మణులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు….