Site icon PRASHNA AYUDHAM

పేద ప్రజల సమస్యలపై పోరాడాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి

సమస్యలపై
Headlines:

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి*

*ఇల్లందకుంట అక్టోబర్ 27 ప్రశ్న ఆయుధం*

పేదప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, అన్యాయాలు అక్రమాలపై, దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో ప్రజాసంఘాల సమన్వయ కమిటీ సమావేశం చెల్పూరి రాములు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి హాజరై సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ పేదల పక్షాన దేశవ్యాప్తంగా నికరంగా పోరాడుతున్నది ఎర్రజెండానే అని కార్మికులు కర్షకులు వృత్తిదారులు విద్యార్థి యువజనలు మహిళలు మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనునిత్యం వివిధ రూపాల్లో ఆందోళనలో పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రజా పోరాటాల ముందు నిర్బంధ చట్టాలు నడవవన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశభక్తి ముసుగులో నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతో ఆరు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేసిందన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి పాలనలో మహిళలపై పిల్లలపై అత్యాచారాలు లైంగిక వేధింపులు హింస కొనసాగుతూనే ఉందన్నారు. ఏటా రెండు లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ ప్రభుత్వ హామీ నీటి మూటలే అయిందన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుక్కుంటుందన్నారని మతోన్మాదం దేశ ప్రగతికి విగాథం కలిగిస్తుందన్నారు జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీవ్ర విగాథం కల్పిస్తాయని అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు అయిపోయినప్పటికీ పథకాలు అమలుకు నోచుకోలేదన్నారు ఒక్క ఫ్రీ బస్సు మీనాయిస్తే ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కాలేదు అన్నారు. రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగించాలని వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, నాయకులు తిప్పర బోయిన శ్రీకాంత్, సంతోష్, కొత్తూరిమల్లయ్య, రాజేందర్, ఆరెల్లి ఓదెల్, గంధసిరి సంపత్, మల్లేష్, విక్రమ్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version