ఇన్నాళ్లు ఏం చేశారు.. ఇప్పుడు కూల్చితే ఎలా..?
తెలంగాణలో యోగి సర్కార్ ను గుర్తుకు తెస్తున్నారు
ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ వ్యాఖ్యలు
కేశంపేట పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఎంఐఎం ఎమ్మెల్యే
ప్రభుత్వ స్థలాలు చెరువులు ఇండ్లను కట్టామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం అధికార సిబ్బంది అవి కడుతున్నప్పుడు ఏం చేశారని ఇప్పుడు ఎందుకు ఇండ్లను కూల్చాల్సి వచ్చిందని బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పలుచోట్ల హైదరాబాద్లో ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో కాప్స్ పోలీసులు ఎమ్మెల్యే ముబీన్ ను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేతో మాట్లాడాలని కోరగా మొదట పోలీసులు నిరాకరించారు మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యేను పోలీసులు బయటికి పంపించారు దీంతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే ముబీన్ మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ లా ఉందని అన్నారు. దౌర్జన్యంగా ప్రభుత్వం ఇండ్లను కూల్చిందని ఆరోపించారు. గతంలో ఇండ్లను కడుతున్నప్పుడు సంబంధిత రెవెన్యూ, హెచ్ఎండిఏ, నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. ఇళ్లను శాశ్వతంగా కట్టుకున్న తర్వాత కూల్చే అధికారం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ బాధితులకు నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఇళ్లలోకి ప్రవేశించి అందులో నివసిస్తున్న వారిని బయటికి పంపించి ఇళ్లను కూల్చారని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వానికి హితవు పలికారు.