–ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి రాయల పోలయ్య సెప్టెంబర్ 11అశ్వారావుపేట మండల కేంద్రంలో జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా ఆలయం పక్కన ప్రభుత్వ స్థలంలో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంజూరైన క్రికెట్ ఇండోర్ స్టేడియం మరియు క్రీడా ప్రాంగణం పనులు ప్రారంభించడానికి గతంలో క్రీడా శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చి పూర్తి కొలతలు సేకరణ పూర్తయినందువలన సంబంధిత అధికారులతో కలిసి క్రీడా ప్రాంగణ నిర్మాణ నమూనాని స్థానిక శాసనసభ్యులుజారె ఆదినారాయణ పరిశీలించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం ఆధునిక పరిజ్ఞానంతో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరలో పనులు ప్రారంభించి అనతి కాలంలోనే పూర్తిచేసి అశ్వారావుపేట నియోజకవర్గ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలోపి ఆర్ డి ఈ శ్రీధర్ ఏఈఈ స్పెషల్ పి ఆర్ ఎం
అక్షిత
డిప్యూటీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ పరంధామ రెడ్డి
ఎమ్మార్వో కృష్ణ ప్రసాద్
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
పంచాయతీ సెక్రటరీ శ్రీరామమూర్తి
మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు