గుమ్మలక్ష్మీపురంలో మినీ మహానాడు..

*గుమ్మలక్ష్మీపురంలో మినీ మహానాడు..*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 20 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాల అమలు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* అన్నారు. మంగళవారం నాడు గుమ్మలక్ష్మీపురంలో కురుపాం శాసనసభ్యులు *తోయక* *జగదీశ్వరి* ఆధ్వర్యంలో కురుపాం నియోజకవర్గ మినీ మహానాడు పండుగ వాతావరణంలో నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడు, గుడ్డ, నీడ అందించాలని ఆశయంతో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పేద వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపించే ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు ఆశయాలతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని, కార్యకర్తల సంక్షేమ కోసం ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని మే 27 28 29 తేదీలలో రాష్ట్ర స్థాయి మహానాడు నిర్వహించడం, నియోజకవర్గ మరియు జిల్లాస్థాయిలో మినీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. నేను టిడిపి కార్యకర్తను అని గర్వంగా చెప్పుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అటువంటి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేయడం మనందరి అదృష్టమని తెలిపారు. మినీ మహానాడులో నియోజకవర్గం పరిధిలోని 14 అంశాలను తీర్మానం చేశారు. కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ పరిశీలకులు ఆరేటి మహేష్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now