మెదక్, జిల్లా శివ్వంపేట జనవరి 19 ప్రశ్న ఆయుధం న్యూస్:
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని వివిధ విధుల్లో నిర్మించిన మినీ ట్యాంకులు ఉన్న వాడకంలో లేకపోవడం తో స్థానికులు మంచినీరు సరఫరా నిలిచిపోయినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రానున్న వేసవి కాలంలో నీటి కొరత తీవ్రమవుతుందనీ “ఈ మినీ ట్యాంకులు మరమ్మతులు చేసి వాడకంలోకి తీసుకురావాలని అధికారులను కోరుతున్నాం,” అని స్థానిక గ్రామస్తులు తెలిపారు. “రెండు, మూడు రోజుల పాటు మంచినీరు సరఫరా నిలిచిపోయినప్పుడు ఈ ట్యాంకులు ఎంతో ఉపయోగపడతాయి. వేసవి కాలంలో నీటి కొరతను అధిగమించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.”
ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను గ్రామ ప్రజలు కోరారు . మినీ ట్యాంకులను వాడకంలోకి తీసుకురావడం ద్వారా స్థానికులకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది అని గ్రామస్తులు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.