
సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జే రమేష్
12న జరిగే జిల్లా వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
భద్రాచలం
గ్రామపంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా ఎన్నో ఆందోళనలు పోరాటాలు చేసిన గాని వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగే 12 న ఒకరోజు సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ జె రమేష్ పిలుపు ఇచ్చినారు ఈ సందర్భంగా జరిగిన జనరల్ బాడీని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తమను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని అర్హులైన వారిని కార్యదర్శులుగా నియమించాలని జీవో 51ని సవరించాలని విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అందరికీ పిఎఫ్ ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వాలని ధహన సంస్కారాలకు 30000 రూపాయలు ఇవ్వాలని వయసు మీరిందనే పేరుతో ఉద్యోగాలను తొలగించవద్దని డిమాండ్లతో జరుగుతున్న ఒకరోజు సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలిపిస్తూ గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల ను అనేక భ్రమలు పెట్టిందని ఆనాడు సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు టెంట్ దగ్గరకు వచ్చి అనేక హామీలు ఇచ్చారని కానీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్న ఇంతవరకు వారి డిమాండ్లను నెరవేర్చలేదని పెండింగ్ వేతనాలు ఇవ్వలేదని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్ లను నెరవేర్చాలని లేనియెడల భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ, నర్సారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కాపుల రవి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు శ్రీనివాస్, సాయి, చెన్నకేశవులు, ప్రేమ్, వర రాజు,విజయ, అనసూయ ఆదినారాయణ ,మనోజ్ రెడ్డి మరియు వందలాదిమంది కార్మికులు పాల్గొన్నారు