సంగారెడ్డి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 18న బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రావాలని ఆహ్వానించారు. శుక్రవారం సంగారెడ్డిలో మంత్రి నివాసంలో గౌడ సంఘాల నాయకులు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజుగౌడ్, గౌడ సంఘం పెద్దలు రాములుగౌడ్, హనుమంతు గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు వినయ్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రామాగౌడ్, గౌడ సంఘం సంగారెడ్డి నాయకులు సంగమేశ్వర్ గౌడ్, నరసింహ గౌడ్, వెంకటేశంగౌడ్, మనీష్ గౌడ్, కవి రచయిత ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్న విగ్రహ ఆవిష్కరణకు మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆహ్వానం
Oplus_131072