Site icon PRASHNA AYUDHAM

సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా

IMG 20250817 144410

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా పరిశీలించారు. డ్యామ్ సురక్షితత పై ప్రత్యామ్నాయ మార్గాలను ,మంత్రి దామోదర్ రాజనర్సింహా జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, ఇరిగేషన్ ఎస్ఈ పొచ్చామల్లు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న 31,968 క్యూసెక్కుల వరద దృష్ట్యా, సింగూర్ ప్రాజెక్ట్ నుండి దిగువకు 43,634 క్యూసెక్కుల వరదను 5 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు, సింగూర్ జలాశయం భద్రతను కాపాడే విధంగా 520.5 మీటర్ల వరకు నీటి నిల్వను యావరేజ్‌గా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version