Site icon PRASHNA AYUDHAM

వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు

IMG 20251230 101659

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలసి పాల్గోన్నారు. దేవాలయం అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

Exit mobile version